గుమ్మడిలో ఉన్నాయి సౌందర్యానికి సహాయపడే గుణగణాలుగుమ్మడిలో ఉన్నాయి ఆశ్చర్యం కలిగించే సౌందర్య రహస్యాలు

గుమ్మడి కాయను మన ఇండియాలో సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే ఔషధగుణాలు కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ అనేక విధాలుగా ఉపయోగపడే గుమ్మడి నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు. ముఖ్యంగా గుమ్మడికాయలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్, పొటాషియం, ఫాస్పరస్, మరియు విటమిన్స్ విటమిన్ ఎ, బి1,సి, డి మరియు బి 12వంటి ప్రధానమైన విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. 

మరియు ఇందులో ఫ్లెవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యనాకి మాత్రమే కాదు కాదు, ఇందులో అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చర్మ మరియు కేశ సౌందర్యానికి సహాయపడే గుణగణాలు గుమ్మడి లో పుష్కలంగా ఉన్నాయి. 

ఇవి చర్మ సమస్యలకు బాగా సహాయపడుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలను నేచురల్ గా క్యూర్ చేస్తుంది. ఇది డ్రై మరియు ఆయిల్ స్కిన్ అన్ని రకాల చర్మ తత్వాలకు సహాయపడుతుంది.

చర్మంను హెల్తీగా మరియు ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇది సన్ రాషెస్ ను మరియు స్కిన్ అలర్జీలను నివారిస్తుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ ఇ చర్మంను సాఫ్ట్ గా మార్చడంతో పాటు పోషణను అందిస్తుంది.

స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది : ఏవైనా కీటకాలు కుట్టినా మంటను నివారిస్తుంది.మరియు కాలిన గాయాలను మాన్పుతుంది . ఇన్ఫెక్షన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది . గుమ్మడిలో ఉండే జింక్ మరియు విటమిన్ సి గాయాలను మాన్పుతుంది . గాయాలైన ప్రదేశంలో గుమ్మడి జ్యూస్ ను అప్లై చేయాలి. లేదా నేరుగా త్రాగవచ్చు.

ముడుతలను నివారిస్తుంది మరియు హైడ్రేషన్ అందిస్తుంది. గుమ్మడి జ్యూస్ లో కొద్దిగా తేనె, విటమిన్ ఇ ఆయిల్, పెరుగు మరియు నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది మరియు ముడుతలను నివారిస్తుంది మరియు స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది . ముడుతలను నివారించడంలో ఒక గొప్ప ప్రయోజనం.

పిగ్మెంటేషన్ నివారిస్తుంది : గుమ్మడి జ్యూస్ లో క్యాల్షియం, ప్రోటన్స్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో మచ్చలను, పిగ్మెంటేషన్ మరియు ఇతర సమస్యలను నివారిస్తుంది. చర్మంను తేలికపరిచి మచ్చలు లేకుండా చేస్తుంది. గుమ్మడి జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
 

Comments

Web Design Jobs