జుట్టు రాలడం నివారించే హోం మేడ్ హెయిర్ మాస్క్జన్యు సంబంధ వ్యాధులు, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహారం మొదలగునవన్నీ జుట్టు మీద ప్రభావం చూపుతుంది. దాంతో తలలో చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చిక్కుబడటం, హెయిర్ ఫాల్, తలలో దురద వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసి, వేసుకొనే హెయిర్ మాస్క్ ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా?

జుట్టు రాలడం అరికట్టే హోం మేడ్ హెయిర్ మాస్క్ కోసం ప్రధానంగా మీరు ఎలాంటి పదార్థాలు ఉపయోగించాలన్న విషయం తెలుసుకోవాలి. వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి హోం మేడ్ హెయిర్ మాస్క్ లు ఏంటో ఒక సారి చూద్దాం...

1. గుడ్డులోని పచ్చసొన మరియు గ్రీన్ టీ:ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు చెంచాల గ్రీన్ టీ మిక్స్ చేసి తలలో జుట్టు మొదల్ల నుండి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మీకు కనుక డ్రై హెయిర్ ఉన్నట్లైతే దీనికి ఎగ్ వైట్ ను ఉపయోగించుకోవాలి . ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

2. హెయిర్ ఆయిల్ మరియు విటమిన్ ఇ :

కొబ్బరి నూనె, బాదం, ఆలివ్ మరియు జోజోబా ఆయిల్ ను ఒక బౌల్లో మిక్స్ చేసి , అందులో కొద్దిగా విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి మిక్స్ చేయాలి. దీన్ని తలకు పట్టిస్తూ, 10 నిముషాలు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకొనే ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రోజువిడిచి రోజు వేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. ఉల్లిపాయ మరియు ఆలమ్ మాస్క్:

ఆనియన్ మిక్సీలో వేసి మొత్తగా చేసి, జ్యూస్ పిండుకోవాలి. దానికి కొద్దిగా ఆలమ్ ను మిక్స్ చేసి తకలు మరియు కేశాలకు పట్టించాలి.వారంలో రెండు సార్లు రాత్రుత్లో మాస్క్ ను వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

 

4. అరటి మరియు తేనె హెయిర్ మాస్క్:

జుట్టు రాలడం నివారించేందుకు ఇది ఒక ఉపయోగకరమైన హెయిర్ మాస్క్. రెండు అరటిపండ్లుకు పొట్టు తీసి మెత్తగా చేయాలి . దానికి తేనె మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి 5నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. పెరుగు మరియు వెనిగర్:

పెరుగు మీ జుట్టుకు డీప్ కండీషన్ ఇస్తుంది. మీ జుట్టు పొడవును బట్టి, హెయిర్ మాస్క్ రెడీ చేసుకోవాలి . ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె మిక్స్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత తలకు పట్టించి 15నిముసాల తర్వాత తస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును స్మూత్ గా మరియు గ్లాసీగా మార్చుతుంది.

 

6. అవొకాడో:

బాగా పండిన అవొకాడోను మ్యాష్ చేసి. అందులో అరకప్పు పాలు పోసి, తర్వాత ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ కూడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, తలకు పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 

7. స్ట్రాబెర్రీ మాస్క్:

స్ట్రాబెర్రీ గుజ్జు, కొబ్బరి నూనె మరియు తేనె మూండింటిని మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.8. కరివేపాకు మరియు కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో ఫ్రెష్ గా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

9. స్పెషల్ హనీ మాస్క్:

ఈ వండర్ఫుల్ హెయిర్ మాస్క్ తయారుచేయడానికి ఒక చెంచా తేనె, ఆముదం, ఒక చెంచా రమ్, ఒక చెంచా గుడ్డు పచ్చసొన, విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

10.ఓట్ మీల్ హెయిర్ మాస్క్:

ఒక కప్పు పాలలో ఓట్స్ మిక్స్ చేసి, తర్వాత దీన్ని తలకు పట్టించి, 20 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

Enjoy......

Comments

Web Design Jobs