వేసవిలో పాదాల మంటలను నివారించే వంటింటి చిట్కాలు



అవయవాలకు రక్త ప్రసరణ తక్కువగా జరగటంవలన ప్రధానంగా ఈ పాదాల మంటలు ఏర్పడతాయి. ప్రధానంగా, కాళ్ళలో దెబ్బతిన్న నరాల కారణంగా, వయసు పైనబడుతున్నకొద్ది నరాలు బలహీనపడటం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

కీమోథెరపీ, మద్యపానం, అథ్లెట్ల పాదాలు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, రక్తహీనత మరియు కొన్ని ఇతర కారణాల వలన ఈ అరికాలి మంటలు ఏర్పడుతాయి. వీటివలన వేడిగా, సూదులు గుచ్చినట్లుగా నొప్పులతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపవలసి వొస్తుంది. మీరు వేసవిలో కొంత వ్యక్తిగత సంరక్షణ మరియు కొన్ని గృహ వైద్య నివారణలతో ఈ అరికాళ్ళ మంటలను తగ్గించుకోవొచ్చు.

మధుమేహం కలిగిన వృద్ధులు, ఎక్కువ సమయం నిలబడి ఉండే ఉద్యోగస్థులు మరియు నరాల రుగ్మతలు ఉన్నవారు ఈ పరిస్థితి ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. సరైన స్వీయ రక్షణ మరియు క్రింద ఇచ్చిన కొన్ని గృహవైద్య నివారణలు మీకు వేసవిలో కలిగే ఈ పరిస్థితి నుండి విముక్తి పొందటానికి సహాయపడతాయి.

 
అల్లం
ప్రతి రోజు పది నిమిషాలు అల్లం రసం మరియు ఆలివ్ లేదా కొబ్బరి నూనె కలిపిన వెచ్చని మిశ్రమంతో మీ పాదాలను మరియు కాళ్లను మర్దన చేయటం వలన నొప్పి తగ్గుతుంది మరియు రక్త ప్రసరణ చురుగ్గా జరుగుతుంది. మీ శరీరంలో రక్త ప్రసరణ చురుగ్గా సాగటానికి రోజువారీ ఒక అల్లంముక్క తినాలి.
విటమిన్ B3

విటమిన్ B3 సమృద్ధిగా ఉన్న గుడ్డు పచ్చసొన, పాలు, బటానీలు మరియు చిక్కుళ్ళు వంటి పోషక ఆహార వినియోగాన్ని పెంచడం వలన పాదాలమంటలకు ఒక సాధారణ సహజ పద్ధతిలో నివారణ కలుగుతుంది. విటమిన్ B3 నరాలకు బలాన్ని చేకూరుస్తుంది మరియు రక్తపీడనం వలన నరాలు తెగిపొవటాన్ని నిరోధిస్తుంది.

ఆహారం మరియు ఆర్ద్రీకరణ
ప్రోటీన్లు మరియు కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారాన్ని ముఖ్యంగా చేపలు, ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, నట్స్ మరియు అవిసె గింజలు ఎక్కువగా తీసుకోవటం వలన క్రమంగా అరికాళ్ళ మంటలు నివారింపబడి పరిస్థితి మెరుగుపడుతుంది. పానీయాలు ఎక్కువగా తీసుకుని ఆర్ద్రీకరణతో ఉండండి.

హతోర్న్
ఒక కప్పు నీటిలో హాతోర్న్ఒక టేబుల్ స్పూన్ కలపండి మరియు రోజులో పదిహేను నిమిషాలు నాననివ్వండి . హాతోర్న్ రక్త నాళాలను వ్యాకోచింప చేయటం వలన రక్తప్రసరణ కాళ్ళకు మరియు ఇతర శరీర భాగాలకు మరింత చురుగ్గా జరుగుతుంది. ఇది వేసవిలో అరికాళ్ళ మంటలకు ఉత్తమ నివారణలలో ఒకటి ..
థైమ్
థైమ్ కలిపిన చల్లని లేదా వేడి నీటిలో అరికాళ్ళను నాననివ్వటం వలన అరికాళ్ళ మంటలకు సంబందించిన నొప్పి మరియు తిమ్మిరి ఉపశమనం కలుగుతుంది. ఇలా రోజులో ఇరవై నిమిషాలు మీ పాదాలను థైమ్ లో నాననివ్వటం వలన తరుచుగా సంభవించే ఈ పరిస్థితిని నిరోధించవచ్చు.

వ్యాయామాలు మరియు ఫుట్ మసాజ్

వాకింగ్, జాగింగ్ మరియు పరుగెత్తటం వంటి రెగ్యులర్ వ్యాయామాలు ఖచ్చితంగా అమలు చేయటం వలన మంటలు మరియు మీ కాళ్ళ యొక్క బాధాకరమైన పరిస్థితి సడలింపబడుతుంది. వ్యాయామం చేయటం వలన మీ శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ అరికాళ్ళ మంటల అసౌకర్యానికి మరియు నొప్పి తగ్గిడానికి మర్దన కూడా ఒక మంచి మార్గం.

బేర్ఫుట్ వాకింగ్
పాదరక్షలు లేకుండా గడ్డి లేదా ఇసుక మీద వాకింగ్ చేయటం వలన పాదాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కానీ, కఠినంగా ఉన్న నేలపై వాకింగ్ నివారించండి ఎందుకంటే దీనివలన నొప్పి మరియు అసౌకర్యం ఎక్కువవుతుంది. ఎల్లప్పుడూ మీ పాదాలు పొడిగా ఉండేట్లుగా చూసుకోండి.

 
 




Comments

Web Design Jobs