చమ్ చమ్ రిసిపికావలసినవి:
 
పాలు: లీటరు;
వెనిగర్: టేబుల్ స్పూన్;
పంచదార: రెండు కప్పులు;
నీళ్లు: నాలుగు కప్పులు;
ఐసింగ్ సుగర్: మూడు టేబుల్ స్పూన్లు;
కోవా: పావు కప్పు;
టూటీఫ్రూటీ: కొద్దిగా;
బాదంతురుము: కొద్దిగా,
కుంకుమపువ్వు: కొద్దిగా
 
తయారు చేయు విధానం:
 
1. ముందుగా పాలను మరిగించాలి. మరుగుతుండగా వెనిగర్ వేస్తే, పాలు విరుగుతాయి. పల్చటి వస్త్రంలో పాలను వడకట్టి విరుగుముద్ద మీద ఏదైనా బరువు పెట్టి మూడునాలుగు గంటలసేపు పక్కన ఉంచాలి. తర్వాత నీరు పూర్తిగా పోయి గట్టిగా అయ్యాక పాల విరుగును మిక్సీలో వేసి మెత్తగా చేయాలి మనకు నచ్చే ఆకారంలో (గుండ్రంగా, పొడవుగా... ఎలా కావాలంటే అలా) వాటిని తయారుచేసి పక్కన ఉంచుకోవాలి
2. తర్వాత స్టౌ మీద ఒక పెద్దపాత్ర ఉంచి, అందులో నాలుగు కప్పుల నీరు, రెండు కప్పుల పంచదార వేసి కరిగించాలి.
3. తయారుచేసి ఉంచుకున్న వాటిని (చమ్‌చమ్‌లు) ఆ పాకంలో వేసి, పాత్ర మీద మూత పెట్టి, సుమారు 20 నిముషాలపాటు ఉడికించాలి కోవాలో ఐసింగ్ సుగర్ వేసి మెత్తగా అయ్యేలా కలపాలి
4. చమ్‌ చమ్‌లను పాకంలో నుంచి బయటకు తీసి చల్లారనివ్వాలి. వాటిని మధ్యకు కట్ చేసి... వాటిలో ఐసింగ్‌సుగర్, కోవాల మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. వీటిని రెండుగంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. పేపర్ కప్స్‌లో ఉంచి సర్వ్ చేయాలి.

 
Comments

Web Design Jobs