ఠండై రిసిపికావలసినవి:
 
నీళ్లు: రెండు లీటర్లు;
పంచదార: 2 కప్పులు;
రోజ్ వాటర్: అర టేబుల్ స్పూన్;
కుంకుమపువ్వు: కొద్దిగాపేస్ట్‌కోసం...
ఆల్మండ్స్: 25 (నానబెట్టి, తొక్కతీసేయాలి);
జీడిపప్పు: 25 (నానబెట్టాలి);
తర్బూజా గింజలు: మూడు టేబుల్ స్పూన్లు (నానబెట్టాలి);
గసగసాలు: 3 టేబుల్ స్పూన్లు;
ఏలకులు: టీ స్పూన్;
లవంగాలు: నాలుగైదు;
సోంపు: అర టేబుల్ స్పూన్;
ధనియాల పొడి: అర టేబుల్ స్పూన్;
మిరియాలు: ఆరేడు,
మెంతులు: అర టీ స్పూను
 
తయారు చేయువిధానం:
 
1. అరలీటరు నీటిలో పంచదార వేసి పక్కన ఉంచి, కరిగాక వడకట్టాలి.
 
2. తర్వాత దనియాలపొడి తప్పించి మిగతా పదార్థాలను శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీటిలో గంటసేపు నానబెట్టి, నీరు వంపేసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒకటిన్నర లీటర్ల నీటిలో వేసి బాగా కలిపి పల్చటి వస్త్రంలో వడకట్టాలి.
 
3. ఇప్పుడు ఆ నీటిలో పాలు, పంచదార, రోజ్‌వాటర్ వేసి కలపాలి రెండు మూడు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. కుంకుమపువ్వు, బాదం తురుములతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.

 
Comments

Web Design Jobs