రంజాన్ సమయంలో చేయకూడని 10 పనులురంజాన్ అంటే కేవలం “తినకుండా ఉండడం” మాత్రమే కాదు, దానివల్ల మీకు శారీరకంగా, ఆధ్యాత్మికంగా కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయని అర్ధం. రంజాన్ అంటే కేవలం ఆహారానికి మాత్రమే దూరంగా ఉండడం కాదు. ఉపవాసం అనేది రంజాన్ కి చెందిన అనేక విషయాలలో ఉపవాసం ఒకటి మాత్రమే, అందులో ఉపవాసమే కాకుండా చేయవలసిన మరెన్నో పనులను మనం అర్ధం చేసుకోవాలి. మీ మనసు ఆరోగ్యంగా ఉంటే, మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఎప్పుడూ చెప్తారు. రంజాన్ మీ పాపాలను కడిగేసి, అనారోగ్యకరమైన కోరికలను నియంత్రించి మీ మనసును, ఆత్మను శుద్ది చేస్తుంది.

 

రంజాన్ లో, మీ ప్రార్ధనలు వేగంగా విని, మీ పాపాలను కదిగేసేట్టు మీ ఆత్మ శుద్ది చేయబడే సమయం మీరు పొందుతారు. మీ కోరికలను అన్నిటినీ నియంత్రించుకుని, అల్లా కు దగ్గరవుతారు. మీరు ఇతరులకు కొంత డబ్బును, ఆహారాన్ని దానం చేయడం ద్వారా, మానవత్వానికి, సంతోషానికి సరైన అర్ధం తెలుసుకోగలుగుతారు.

 

డబ్బులేక ఆహరం కొనుక్కోలేని వారి బాధలను తొలగిస్తుంది ఈ రంజాన్ . రంజాన్ ఉపవాసం ఇస్లాం లోని స్తంభాలలో ఒకటి, దీనిని చేయకపోతే మంచి ముస్లిం అనిపించుకోరు. రంజాన్ ఉపవాసంలో అనేక వైద్యపరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచి, మీ లివర్, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో అనేక ఆధ్యాతిమిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీ ఆత్మ శుద్ధపడి, మీ బుర్ర చెడు ఆలోచనల నుండి విముక్తి పొందుతుంది మీరు అల్లా కి దగ్గరయ్యి, చెడు పనులను మర్చిపోతారు.

 

రంజాన్ దీవెనల సమయం, అన్ని దయ్యాలు సర్వశక్తి గల అల్లాచే బంధించబడతాయి, అందువల్ల అవి రంజాన్ తో అడ్డుతగలవు. రంజాన్ సమయంలో మీరు చేయకూడని కొన్ని ప్రధాన పనులు ఇక్కడ ఇవ్వబడ్డాయి

 

1. మీరు నిజంగా ముస్లిం అయితే మీ దృష్టిని మరల్చండి. మీరు శృంగారంవైపు మొగ్గుచూపితే మీకు ప్రతికూల ఆలోచనలు వస్తాయి, మీరు పాపం చేసిన వారవుతారు. ప్రత్యేకంగా దేవుని దీవెనలు అందుకునే రంజాన్ సమయంలో, అలంటి పాపపు పనులు మానుకోకపోతే, మీరు రోజా ప్రయోజనాలను పొందలేరు. అది కేవలం ఒక సాధారణ ఉపవాసం ఔతుంది.

2. ఎవరితో పోరాడోద్దు, నినదించ వద్దు రంజాన్ ఓపికగా ఉంది, ఇతరుల పట్ల మానవత్వాన్ని చూపించాల్సిన సమయం. మీరు పోరాడి, నిందిస్తే, మీ మనసు, ఆత్మ ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా లేదని అర్ధం, అదే రంజాన్ ప్రధాన ఉద్దేశం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కూడా, మాట్లాడకుండా ఉండి, “నేను ఉపవాసం లో “ ఉన్నాను అని మూడుసార్లు అతనికి చెప్పండి.

3. ఇస్లాం లో, సరైన దుస్తులు ధరించాలి, మీ స్వల్ప దుస్తులు చెలరేగి పోయేట్టు చేస్తే, ఇతరులు మీవైపు ఆకర్షితులవుతారు. ఇది కూడా మీ ఉపవాసాన్ని నాశనం లేదా అవినీతి పరుస్తుంది. రంజాన్ మాసంలో, మీరు ఆడ లేదా మగ అనే తేడాలేకుండా మీ దుస్తుల ఇషయంలో ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలి. స్త్రీలు వారి శరీరాన్ని కప్పి ఉంచుకుని, తలను సరిగా ఉంచుకోవాలి. అలాగే మగవారు కూడా. దీనివల్ల ఇతరుల చెడు కళ్ళ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి, పురుషులు మీ వస్త్ర ధారణకు ఆకర్షితులు కాకుండా నిరోధించ వచ్చు. 

4. ఇతరులు ఆకలితో, నీరసంగా ఉన్నపుడు వారు ఎంత బాధపడతారో మీకు నేర్పుతుంది, దానివల్ల ఆకలిని తట్టుకోవడం ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. ముస్లిం లు వారి బాధను గ్రహించి, వారిపట్ల ఉదారంగా ఉంటారు. మీరు ఎక్కువ తింటే, మీరు దాని ప్రయోజనాన్ని కోల్పోతారు. 

5. పిచ్చివాడి లాగా పెద్దగా నవ్వడం అనేది నీతివంతమైన పని కాదు. మీ మహ్మద్ ప్రవక్త (శాంతి అతని మీద ఉంటుంది) ఇచ్చిన అందమైన నవ్వును ఉపయోగించుకోండి, పెద్దగా ఎపుడూ నవ్వొద్దు. ఇది మీ వ్యక్తిత్వానికి మరింత అందాన్ని జోడించి, దైవభక్తిని ప్రతిబింబిస్తుంది. రంజాన్ సమయంలో మీరు పెద్దగా నవ్వితే, మీ ఉపవాసం చెడిపోతుంది లేదా మక్రుహ్ (ఇష్టపడకపోవడం లేదా అప్రియంగా) ఉంటుంది. 

6. రంజాన్ సమయంలో రోజంతా ఆహరం గురించి, తినడం గురించి ఆలోచించడం మంచిది కాదు. ఇది మీ ఉపవాసాన్ని నాశనం చేయడమే కాకుండా మీరు ప్రార్ధనల మీద కూడా శ్రద్ధ లేకుండా చేస్తుంది. 

7. మీరు రంజాన్ మాసంలో మీ బరువును తగ్గించుకోవడానికో లేదా బైటకు కనిపించడానికో ఉపవాసం చేయకండి, ఆ ఉపవాసం అల్లాముందు దండగే. మీ ఆలోచన పవిత్రంగా ఉండాలి, మీరు సర్వసక్తిమంతుడైన అల్లా కోసం మరెవరి కోసం కాకుండా ఉపవాసం చేయాలి. 

8. మొహమ్మద్ ప్రవక్త చాడీలు, అసభ్యపదాలు వాడడం, వేగంగా అబద్ధాలు చెప్పడం వంటివి (బుఖారి) చేయకూడదని చెప్పాడు. మీరు అబద్ధాలు ఆడితే ఆహరం లేదా పానీయాలు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పాడు. 

9. రంజాన్ నెలలో లైంగిక చర్యలు, లైంగిక ఆలోచనలను మానుకోవాలి. మీరు ఉపవాసం ఉన్నపుడు పగటి పూట మీ భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొన కూడదు. మీ కోరికలన్నిటినీ నియంత్రించు కోవలసిన మాసం రంజాన్. 

10. సమయంలో పిచ్చి జోకులు వేయడం, అశ్లీలం, అసభ్యకరంగా మాట్లాడడం, అనైతికంగా ప్రవర్తించడం మానుకోవాలి. అసభ్యకర విషయాలను మాట్లాడడం, వినడం కూడా మానుకోవాలి. ఇలాంటి విషయాలను సాధారణ పరిస్థితులలో కూడా మానుకోవచ్చు, కాని ఉపవాసం ఉన్నపుడు అలంటి చర్యలు ఉపవాసాన్ని నాశనం చేసి, పాడుచేస్తుంది. 

 

Comments

Web Design Jobs