కర్లీ హెయిర్ ను స్ట్రెయిట్ హెయిర్ గా మార్చుకోవటం ఎలా ?కొందరు వంకీలు తిరిగిన ఒత్తయిన జుట్టు కావాలనుకుంటారు. ఇంకొందరు ఉంగరాల్లాంటి కురులు వద్దనుకుంటారు. రింగురింగుల జుట్టును స్ట్రెయిట్ చేయడానికి తెగ కష్టపడుతుంటారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచలో స్ట్రెయిట్ హెయిర్ ట్రెండ్ నడుస్తున్నది. స్టైల్ కి ఇది ఒక స్టేమ్మెంట్ గా ఇప్పుడు ఏ అమ్మాయిని చూసినా స్ట్రెయిట్ హెయిర్ మాయలో పడిపోతున్నారు . స్ట్రెయిట్ హెయిర్ కోసం ఉపయోగించే కొన్ని ప్రొడక్ట్స్ లో కొన్ని రసాయనాలను ఉపయోగించడం వల్ల హెల్తీ హెయిర్ మీద ప్రభావం చూపుతాయి. అందువల్ల జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి నేచురల్ పదార్థాలు బాగా సహాకరిస్తాయి.

1). పాలు, కొబ్బరి పాలు, తేనె

పాలు, కొబ్బరి పాలు, తేనె.. ఈ మూడింటినీ కలిపి వెంట్రుకలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకుంటే వంకీల జుట్టు కాస్తా స్ట్రెయిట్ అవుతాయి.

2). పాలు, గుడ్డు

పాలు, గుడ్డు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. 10 నిమిషాల తర్వాత వెంట్రుకల నుంచి కారుతున్న లిక్విడ్‌ని పిండేయాలి. తర్వాత తలకు ప్లాస్టిక్‌ క్యాప్‌ పెట్టుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

3). పాలను

పాలను స్ప్రే బాటిల్‌లో నింపి కుదుళ్ల నుంచి చివరల వరకూ వెంట్రుకలను స్ర్పే చేయాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి.

4). తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్‌

తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్‌ చేసి వేడి నీళ్లలో ముంచి పిండిన టవల్‌ చుట్టాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

5). అలోవేరా గుజ్జు

అలోవేరా గుజ్జుకు రోజ్‌మేరీ, శాండిల్‌వుడ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. కుదుళ్లకు పట్టించాలి. రెండు గంటలాగి తలస్నానం చేయాలి.

4). అరటి గుజ్జు

అరటి గుజ్జు, తేనె, పెరుగు, ఆలివ్‌ ఆయిల్‌లను కలుపుకుని 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత వెంట్రుకలకు పట్టించి షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి.

5). తడి జుట్టు పూర్తిగా ఆరేవరకూ ప్రతి 5 నిమిషాలకోసారి బ్రష్‌ చేస్తూ ఉండాలి.

తడి జుట్టు పూర్తిగా ఆరేవరకూ ప్రతి 5 నిమిషాలకోసారి బ్రష్‌ చేస్తూ ఉండాలి. ఇందుకోసం జుట్టును పాయలుగా విడదీసి తల నుంచి కింది వరకూ నిటారుగా దువ్వుతూ ఉండాలి. ఇలా ఫ్యాన్‌ ముందు కూర్చుని కూడా చేయొచ్చు.

6). జుట్టు తడిగా ఉన్నప్పుడే ఎడమవైపు జుట్టును కుడివైపుకి దువ్వి

జుట్టు తడిగా ఉన్నప్పుడే ఎడమవైపు జుట్టును కుడివైపుకి దువ్వి తల వెనక ముడి వేసి పిన్స్‌ పెట్టాలి. అలాగే కుడివైపు వెంట్రుకలను ఎడమవైపుకి దువ్వి తల వెనక ముడి వేసి పిన్స్‌ పెట్టాలి. ఈ ముడులకు స్కార్ఫ్‌ చుట్టి పూర్తిగా ఆరనివ్వాలి.

7). తడి జుట్టును పాయలుగా విడదీసి రోలర్స్‌ తీసుకుని

తడి జుట్టును పాయలుగా విడదీసి రోలర్స్‌ తీసుకుని వాటికి వెంట్రుకలను చుట్టి తల దగ్గరికి రోల్‌ చేసి పిన్స్‌ పెట్టాలి. ఆరిపోయాక జుట్టు సె్ట్రయిట్‌గా తయారవుతుంది.

8). రాత్రి పూట తడి జుట్టుతో రెండు పోనీ టెయిల్స్‌ వేసుకోవాలి

 రాత్రి పూట తడి జుట్టుతో రెండు పోనీ టెయిల్స్‌ వేసుకోవాలి. ఈ పోనీ టెయిల్స్‌కు అంగుళానికొకటి చొప్పున ఎలాస్టిక్‌ బ్యాండ్స్‌ వేయాలి. పొద్దునకల్లా జుట్టు సె్ట్రయిట్‌గా తయారవుతుంది.

9). తడి జుట్టును

తడి జుట్టును తాడులా తిప్పి తల వెనక ముడి వేయాలి. పూర్తిగా ఆరాక బ్రష్‌ చేసుకోవాలి.

 

Comments

Web Design Jobs