రెస్టారెంట్ శైలి చికెన్ బిర్యానీ రెసిపీబిర్యానీ ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. అందులో ఎన్ని వేరైటిస్ వచ్చిన వాటిని తినటం మాత్రం మానరు.
దం బిర్యానీ చాల మంది హోం లో ట్రై చేస్తారు కాని  రెస్టారెంట్ లో వచినట్లు రాదూ.

ఇక్కడ మీకోసం చిత్రాలతో రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చుడండి.
చిత్రాలు చూస్తూ మీరు కూడా చేయండి. తినండి ఆనందించండి


1. ముందుగా ఒక గంటసేపు  బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచండి.

 


2. మసాలా పొడి కోసం మీకు పైన చెప్పినవి అన్ని పదార్థాలు తీసుకోండి.

 


3. అవి అన్ని కలిపి మిక్సి లో వేసి మెత్తగా పొడిగా చేసుకోవాలి.

4. చికెన్ ని మీకు కావాల్సిన విధం గా ముక్కలుగా చేసుకొని, శుభ్రం గా కడగాలి.


5. ఆ కడిగిన చికెన్ లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి.


6. తరువాత అందులోనే కొత్తిమీర, ముక్కలుగా చేసుకున్న పచ్చి మిరపకాయలు కూడా కలపాలి.


7. అలాగే వాటితో చిక్కటి పెరుగు, ముందుగా చేసుకొన్నా గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి.


8. కలిపినా తరువాత వెంటనే స్టౌ మిధ పెట్టకుండా బౌల్ పైన మూత పెట్టి, 1 లేక 2 గంటలు ఉంచాలి.

9. తరువాత స్టౌ మీద కలయి పెట్టి వేడి అయ్యాక నూనె  వేసి, అందులో ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచేవరకు వేయించాలి.


10. వేయించిన తరువాత ఒక బౌల్ లో తిసి పక్క పెట్టాలి.


11. ఇప్పుడు అదే స్టౌ మీద కొంచం పెద్ద కడాయి  పెట్టి, ముందుగా నన బెట్టుకున్న బిర్యానీ బియ్యం , ఊప్పువేసి వేడి చేయాలి.


12. పూర్తిగా వండకుండా, 90% మాత్రమే అంటే కొంచం పలుకుగా ఉండేటట్లు వచేక నీరు అన్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి.


13. ముందుగా Marination చేసిన చికెన్ ని బిర్యానీ వండటానికి సరిపడా గిన్నెను తీసుకొని, అందులో వేసి, 1/2 నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి 5 నిముషాలు వేడిచేయాలి.


14. అల వేడి చేసిన తరువాత, అందులో సగం కర్రీ ని తిసి పక్కన పెట్టి, ఆ సగం కర్రి పైన బియ్యం, ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల ముక్కలు,  నెయ్యి వేయాలి.

15. కలర్ కోసం 3 టేబుల్ స్పూన్స్ పాలు అందులో కుంకుమ పువ్వు బాగా కలిపి ఎల్లో కలర్ లోకి వాచక పైన చిపిన విధం గ వేయాలి.


16. మల్లి మిగిలిన కర్రి ని సెమ్ ఇంతక ముందు ఎలా చేసేరో అలాగే చేయాలి.


17. మనకి కావాలి అంటే జీడిపప్పు, కిసమిస్ లు కూడా వేసుకోవచ్చు.


18. తరువాత గిన్నె,  పైన పైన చూపిన విధం గా స్టౌ మీద 30 to 35 నిముషాలు ఉంచాలి .


19. చిత్రం లో చూపిన విధం జాగర్తగా మొత్తం కలపాలి

 


వేడి వేడి గా raita  తో గాని ఇంక ఏమైనా చేసుకొన్నా కర్రిస్ తో వడ్డించుకొని తింటే, మీరు ఇంక రెస్టారెంట్ వెళ్ళకుండానే ఇంటిలోనే వన్దుకొవచు.

 

Comments

Web Design Jobs